ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస భారీ చిత్రాల్లో యువ దర్శకుడు రాధాకృష్ణ తో తెరకెక్కిస్తున్న “రాధే శ్యామ్” ఒకటి అలాగే ముందు వరుసలో ఉన్నది. ఇక ఇటీవలే ఈ స్వచ్ఛమైన ప్రేమ కావ్యం ఇటలీలో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వచ్చింది.
ఐతే ఇంకా కేవలం క్లైమాక్స్ ను మాత్రమే మిగుల్చుకొని ఉన్న ఈ చిత్రం ఆ షూట్ కోసం రెడి అవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం వచ్చే వారంలో షూట్ కి అంతా సిద్ధం చేసి డిసెంబర్ రెండు లేదా మూడో వారానికల్లా కంప్లీట్ అవ్వనుందని ఎస్టిమేషన్.
అలాగే ఈ చిత్రం అయ్యిన వెంటనే జనవరిలో ప్రభాస్ తన డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం దర్శకుడు ఓంరౌత్ తో “ఆదిపురుష్”ను మొదలు పెట్టేటనున్నాడు. ఇక రాధే శ్యామ్ లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.