“రాధే శ్యామ్” ఒక అందమైన పెయింటింగ్!

“రాధే శ్యామ్” ఒక అందమైన పెయింటింగ్!

Published on Nov 5, 2020 6:57 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. మొదట్లో కంటే ఇప్పుడు ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవలే వస్తున్న పోస్టర్స్ సహా మోషన్ పోస్టర్ లు ఆడియెన్స్ లో మరింత ఆసక్తిని రేపాయి.

అయితే ఒక ప్యూర్ వింటేజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఇదే విషయాన్ని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుందని, ఒక అందమైన పెయింటింగ్ ను చూసినట్టుగా ఉంటుందని అలా ఈ సినిమాను తెరకెక్కించారని అంటున్నారు.

ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే మోషన్ పోస్టర్ కు అన్ని భాషల్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ను ఇచ్చిన ఈ చిత్రం నుంచి ఎలాంటి కొత్త అనుభూతిని మేకర్స్ అందివ్వనున్నారో తెలియాలి అంటే ఇంకొన్ని నెలలు ఆగక తప్పదు.

తాజా వార్తలు