100 రోజులు పూర్తి చేసుకోబోతున్న ‘రచ్చ’

100 రోజులు పూర్తి చేసుకోబోతున్న ‘రచ్చ’

Published on Jul 12, 2012 4:14 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘రచ్చ’. ఈ చిత్రం రేపటితో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. వేసవి మొదట్లో విడుదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో మంచి విజయాన్ని సాదించింది, ముఖ్యంగా బి మరియు సి సెంటర్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమితంగా ఆదరించారు. రామ్ చరణ్ కెరీర్లో “మగధీర” చిత్రం తర్వాత అత్యధిక వసూళ్లు సాదించిన చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించారు.

సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ మూవీస్ వారు నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ కథ మరియు మాటలు అందించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

తాజా వార్తలు