అల్లు అర్జున్ రేస్ గుర్రం సినిమాపై అంచానాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. యాక్షన్ డ్రామా నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు
ఈ సినిమా సంగీతం ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు ఈ పాటల ప్రోమో వీడియోలకు వస్తున్న స్పందనపై చాలా ఆనందపడ్డాడు. ఇప్పుడు అందరి కళ్ళూ ట్రైలర్ మీద పడ్డాయి. ముందుగా ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలో ట్రైలర్ ని విడుదలచేద్దాం అనుకున్నా కొన్ని కారణాలవలన అది కుదరలేదు. “ఈ ట్రైలర్ ని అధికారికంగా కొన్ని రోజుల్లో విడుదల చేస్తాం” అని థమన్ ట్విట్టర్ లో తెలిపాడు
ఈ సినిమాలో సలోని, రవి కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. నల్లమలపు బుజ్జి, వెంకటేశ్వర రావు నిర్మాతలుంఅనొజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్