స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ నెల మొదట్లో చార్మినార్ దగ్గర చైజ్ సన్నివేశాలను అల్లు అర్జున్, శృతిహాసన్ లపై చిత్రీకరించారు. శృతిహాసన్ ప్రధాన నాయిక. సలోని ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది
ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యేడాది యూరోప్ లో అల్లు అర్జున్, శృతిహాసన్ లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దర్శకుడు సినిమా దాదాపు పూర్తయిందని పలుమార్లు తెలిపాడు. ఈ చిత్రం వచ్చే యేడాది విడుదలకానుంది.
థమన్ సంగీత దర్శకుడు. నల్లమలపు బుజ్జి ఈ సినిమాను లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు