సాదాసీదాగా విడుదలకానున్న రేస్ గుర్రం ఆడియో

Race-Gurram
అల్లు అర్జున్, శృతిహాసన్ నటించిన ‘రేస్ గుర్రం’ సినిమా ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. నల్లమలపు బుజ్జి, వెంకటేశ్వర రావు నిర్మాతలు

ఈ సినిమా ఆడియో ఈ నెల 16న విడుదలకానుంది. కానీ మాకందిన సమాచారం ప్రకారం ప్రకారం ఈ వేడుక చాలా సాదాసీదాగా జరగనుంది. పెద్ద పెద్ద హీరోలందరూ తమతమ ఫంక్షన్లు ద్వారా అభిమానులకు చేరువవ్వడానికి వాడుకుంటే ఈ సినిమా బృందం ఇలా చెయ్యడం ఆశ్చర్యకరంగా వుంది. దీనికి కారణాలు ఇంకా తెలియలేదు. ఇప్పటికే థమన్ సంగీతం అందరికీ చేరువవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం

ఈ సినిమాలో సలోని, రవి కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ త్వరలో విడుదలచేయనున్నారు. ఈ సినిమాలో గ్లామర్ రోల్ పోషించింది. అంతేకాక ఒక పాట కుడా పాడడం విశేషం

Exit mobile version