ఫిలింనగర్ సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ల కలయికలో రానున్న ‘రేస్ గుర్రం’ సినిమా 2014 సంక్రాంతి బరిలోనుండి తప్పుకుని వేసవిలో విడుదలకు సిద్ధమవుతుందట. మార్చ్ లేదా ఏప్రిల్ నెలలలో ఈ సినిమాను మనముందుకు తీసుకొచ్చే అవకాశాలు వున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్ర బృందం నుండి ఇంకా ఎటువంటి స్పందన రాకపోయినా త్వరలో అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలు వున్నాయి
ఈ సినిమా చాలా భాగం షూటింగ్ పూర్తయింది. కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలివున్నాయి. వీటిని జనవరి 5నుండి మొదలుకానున్న షెడ్యూల్లో తెరకెక్కించనున్నారు. శృతిహాసన్ హీరోయిన్.
థమన్ సంగీతదర్శకుడు. ఆటను అందించిన ట్యూన్ లను విని అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేసాడు. నల్లమలపు బుజ్జి నిర్మాత