అల్లు అర్జున్ రేసు గుర్రం ఆడియో రిలీజ్ డేట్

Race-Gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రేసు గుర్రం’. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని మార్చి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఎక్కడ చేయనున్నారు, వేదిక ఏది అనే విషయాలను ఖరారు చేయలేదు. మొదటి సారి అల్లు అర్జున్ – థమన్ కాంబినేషన్ లో వస్తున్న ఆల్బంపై భారీ అంచనాలున్నాయి.

ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. అల్లు అర్జున్ సరసన శృతి హాసన్, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో కిక్ శ్యామ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.

Exit mobile version