ఒకేసారి మూడు భాషల్లో విడుదలవుతున్న రచ్చ

ఒకేసారి మూడు భాషల్లో విడుదలవుతున్న రచ్చ

Published on Feb 29, 2012 1:19 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ మరియు తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రచ్చ చిత్రంతో రామ్ చరణ్ సౌత్ ఇండస్ట్రీలో తన స్టామినాను చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30 న విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ ఏప్రిల్ మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతుంది.

తాజా వార్తలు