భారీ రేటుకు అమ్ముడుపోయిన రచ్చ ఆడియో హక్కులు

భారీ రేటుకు అమ్ముడుపోయిన రచ్చ ఆడియో హక్కులు

Published on Feb 16, 2012 1:07 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ ఆడియో పంపిణీ హక్కులు ఆదిత్య మ్యూజిక్ వారు దక్కించుకున్న విషయం తెలిసిందే అయితే ఈ చిత్ర ఆడియో పంపిణీ హక్కుల కోసం ఆదిత్య మ్యూజిక్ వారు దాదాపుగా 1 కోటి రూపాయల వరకు చెల్లించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక తెలుగు సినిమాకి ఇంత వెచ్చించడం ఇదే ప్రధమం. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర మొదటి పాట లీకై బాగా పాపులర్ అయింది. రామ్ చరణ్ కి జోడిగా తమన్నా హీరొయిన్ గా నటిస్తుండగా సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు