పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న పలు చిత్రాల్లో సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా ఇది కాదా దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. పవన్ అభిమానులకి ఫీస్ట్ సినిమాగా తాను తెరకెక్కిస్తుండగా ఇపుడు షూటింగ్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గానే పవన్ ఈ సినిమా షూటింగ్ ని ఈ వారంలోనే ముగించేస్తారని తెలిపాము.
ఇపుడు అనుకున్నట్టే పవన్ షూటింగ్ కంప్లీట్ చేసినట్టు ఈ సినిమా హీరోయిన్ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఖరారు చేసింది. పవన్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసుకొని ఆమె తనతో వర్క్ చేయడంపై ఆనందం వ్యక్తం చేసింది. పవన్ తో వర్క్ చేయడం తన లైఫ్ టైం మెమరీగా గుర్తు ఉంచుకుంటాను అని ఆమె చెబుతుంది. ఇలా పవన్ తీసిన సెల్ఫీకి ఫోజ్ ఇచ్చి తన ఆనందాన్ని షేర్ చేసుకుంది.