మొదలైన ‘ప్యార్ మెయిన్ పడిపోయా’ మొదటి షెడ్యూల్

Pyar-Mein-Padipoyane

ఆది మరియు షన్వి జంటగా నటిస్తున్న ‘ప్యార్ మెయిన్ పడిపోయా’ సినిమా ఈ వారం హైదరాబాద్ లో మొదలైంది. రవి చావలి దర్శకుడు. రాధామోహన్ ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇతను గతంలో ‘ఏమైంది ఈ వేళ’ మరియు ‘అధినేత’ వంటి సినిమాలు నిర్మించాడు

గతంలో ‘లవ్ లీ’ అనే మంచి సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఈసారి ‘ప్యార్ మెయిన్ పడిపోయా’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా రానున్నారు. వారి సహకారం మరువలేనిది అని దర్శకుడు చెప్పాడు

ఈ సినిమా మొదటి షెడ్యూల్ డిసెంబర్ 8 వరకూ కొనసాగుతుంది. ఆలి, కాశి విశ్వనాద్ ముఖ్యపాత్రధారులు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. సురేందర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్

Exit mobile version