ఆది, సన్వి నటిస్తున్న ప్యార్ మైన్ పడిపోయానే సినిమా ఈ నెల 28న విడుదలకానుంది. రవి చావలి దర్శకుడు. రాధామోహన్ నిర్మాత. ఇటీవలే హీరో హీరోయిన్లపై రామోజీ ఫిలిం సిటీలో ఒక పాటను చిత్రీకరించారు. ఇప్పుడు నానాక్రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ లో ఆది పై ఇంట్రడక్షన్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ “మార్చ్ 11నుండి ఫారెన్ లొకేషన్లలో 10రోజులుపాటు రెండు పాటలను తెరకేక్కినచానున్నాం. దీంతో మొత్తం షూటింగ్ పుర్తికానుంది. మార్చ్ మూడవ వారంలో ఆడియో విడుదల చేస్తారు. ఆది కెరీర్ లో మరో హిట్ గా నిలవనుంది”
అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. ఆది త్వరలో రఫ్ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమానేకాక సంపత్ నంది దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించనున్నాడు