
“పుటుక్కు జర జర డుబుక్కు మే” అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. వినోదాన్ని పంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ చిత్రాన్ని దర్శకుడు నవీన్ తెరకెక్కించారని నటుడు శివాజీరాజ అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి ఉన్న “పుటుక్కు జర జర డుబుక్కు మే”ను టైటిల్ గా పెట్టుకున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుంది అని బాబూమోహన్ అన్నారు. హైదరాబాద్లో లోగో ఆవిష్కరణ జరుపుకున్న ఈ చిత్రం ఒక ఉడతకు మరియు మేకకు మధ్యన జరిగే కథ అని దర్శకుడు తెలిపారు. రదీప్, రత్వ, శివాజీరాజా, బాబూమోహన్, జీవీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రాహుల్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది