అలా అడవుల్లో అడుగు పెట్టిన మాస్ “పుష్ప” రాజ్.!

అలా అడవుల్లో అడుగు పెట్టిన మాస్ “పుష్ప” రాజ్.!

Published on Nov 12, 2020 3:00 PM IST

ఈ ఏడాది “అల వైకుంఠపురములో” అనే చిత్రం బిగ్గెస్ట్ హిట్ ను కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేపట్టిన చిత్రం “పుష్ప”. దీనికి ముందే తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ తో భారీ హిట్ కొట్టడంతో ఇప్పుడు సుకుమార్ తో చేస్తున్న ఈ హ్యాట్రిక్ ఫిల్మ్ పై అంతకు మించిన స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి. పూర్తి స్థాయి మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని సుకుమార్ ప్లాన్ చెయ్యడం అందులోనూ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చెయ్యడంతో పాన్ ఇండియన్ వైడ్ ఆ వైబ్రేషన్స్ మొదలయ్యాయి.

కానీ మొత్తానికి మాత్రం పలు విరామ సమయాల అనంతరం పుష్ప రాజ్ రంగంలోకి దిగేసాడు. ఈ చిత్రంలో బన్నీ ఒక ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడని మేకర్స్ ఇది వరకే ఫస్ట్ లుక్ పోస్టర్ తో చెప్పేసారు. ఇపుడు ఎట్టకేలకు స్టార్ట్ చేసిన షూటింగ్ స్పాట్ లో ఫోటోను మేకర్స్ విడుదల చేసారు. అలా అడవుల వైపు అడుగేస్తూ సాగుతున్న పుష్ప రాజ్ ను వెనక వైపు నుంచి చూపించారు.

ఇది చూస్తేనే అర్ధం అవుతుంది బన్నీని ఎంత రఫ్ అండ్ టఫ్ గా చూపిస్తారో అన్నది. ఆ వాచ్, నెరిసిన చొక్కా హైర్ స్టయిల్ ఇవన్నీ బన్నీలో పూర్తిగా సరికొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఈ పుష్ప రాజ్ ను సుకుమార్ ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు