అల్లు అర్జున్ – సుకుమార్ -దేవి కలయికలో సినిమా వస్తోందంటేనే.. ఆడియన్స్ లో అంచనాలు రెట్టింపు ఆవుతాయి. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చే ఐటమ్ సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. పైగా ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈ సారి కూల్ గా తీరిగ్గా కూర్చుని పుష్ప ఐటమ్ సాంగ్ ని కంపోజ్ చేస్తే.. ఇక ఎలా ఉంటుంది. ఆదరిపోతుంది.
నిజంగా సాంగ్ కూడా అలాగే అదిరిపోయిందట. దేవి పూర్తి చేసిన ఐటమ్ సాంగ్ మాస్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉందని.. మెయిన్ గా సాంగ్ లోని సౌండ్స్ కొత్తగా ఉంటాయని.. మొత్తంగా పుష్ప సినిమాకే ఐటమ్ సాంగ్ ప్రత్యేకంగా నిలుస్తోందని తెలుస్తోంది. ఇక కరోనా అనంతరం స్టార్ చేయబోయే షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారట.
మరి ‘పుష్ప’ సినిమాతో బన్నీ – సుకుమార్ మరో భారీ హిట్ కొడతారా చూడాలి. అయితే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.