“పుష్ప” ఆల్బమ్ ఖచ్చితంగా ప్రిస్టేజియస్.!

మన తెలుగు సినిమాలలో సంగీతం మరియు పాటలు ఎంతటి పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో స్టార్ హీరో మరియు దర్శకుల కాంబోకు వారి ఆస్థాన సంగీత దర్శకునిగా ఒకరితోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి మ్యాజికల్ కాంబోలలో ఒకటే బన్నీ – సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ ల కాంబో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో అందులోను దేవి సంగీత సారధ్యంలో రెండు చిత్రాలు వచ్చాయి.

ఈ రెండు సినిమాల మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా టాలీవుడ్ లో సెపరేట్ బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్నాయి. అయితే ఇప్పుడు వీరి కాంబో నుంచి రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం చిత్రం “పుష్ప” ఆల్బమ్ పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అయితే కేవలం ఈ అంశమే అని కాకుండా ఈ సినిమా ఆల్బమ్ ఖచ్చితంగా భారీ హిట్ అవ్వాల్సిందే అని చెప్పాలి. ఎందుకంటే సుకుమార్ లానే బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండు చిత్రాలకు దేవినే అద్భుతమైన ఆల్బమ్స్ ను ఇచ్చాడు.

కానీ వారి హ్యాట్రిక్ చిత్రానికి మాత్రం థమన్ తో ముందుకు వెళ్లారు. కానీ సుక్కు మాత్రం దేవితోనే కొనసాగారు. అయితే “అల వైకుంఠపురములో” ఆల్బమ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. కానీ ఇప్పటికే రెండు ట్రెండ్ సెట్టింగ్ ఆల్బమ్స్ ను ఇచ్చిన సుక్కు – బన్నీ – దేవి కాంబో ఇక మూడో చిత్రానికి ఏ రేంజ్ లో ఇవ్వాలి? పైగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. సో ఆల్బమ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఉండాలి.

Exit mobile version