తన బెస్ట్ సినిమా ఏంటో చెప్పేసిన జక్కన్న.. ఈ సినిమాలైతే కాదు

SSRajamiuli

తెలుగు సినిమా సహా భారతీయ సినిమా కూడా ఎంతో గర్వించదగ్గ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వర్క్ చేసిన ఎన్నో ఎపిక్ సినిమాలలో ఆడియెన్స్ అందరికీ ఏదొక బెస్ట్ సినిమా ఉంటుంది. అలానే తన అన్ని సినిమాల్లో జక్కన్నకి అంటూ బెస్ట్ సినిమా ఉందట. ఆ సినిమా ఏంటో రీసెంట్ గా జూనియర్ ప్రీరిలీజ్ లో రివీల్ చేశారు.

తన సినిమాలపై ఒక స్పెషల్ ప్రశ్నల సెషన్ జరిగిన సమయంలో “ఈగ” సినిమా ఫ్రేమ్ వచ్చినప్పుడు అదే తన బెస్ట్ సినిమా అని తెలిపారు. మగధీర, సై, ఇతర సినిమాలు కూడా వచ్చాయి కానీ ఈగ మాత్రం తన బెస్ట్ సినిమా అని చెప్పడం విశేషం. దీనితో తన కెరీర్ లో బాహుబలి, RRR లాంటి సినిమాలు పేర్లు చెప్తారు అనుకున్న ఫ్యాన్స్ ఈగ ఆన్సర్ తో ఒకింత ఆశ్చర్యపడి ఉండొచ్చు.

Exit mobile version