ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషన్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘పుష్ప-2’ ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేసిందో మనం చూశాం. సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.
అయితే, ఈ సినిమా తాజాగా బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్ షో టెలికాస్ట్ అయ్యింది. కానీ, ఈ సినిమాకు బుల్లితెర నుంచి అనుకున్న మేర రెస్పాన్స్ దక్కలేదు. ఈ చిత్రానికి కేవలం 12.6 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. గతంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో (29.4), పుష్ప ది రైజ్ (22.5) రేటింగ్స్‌తో అదరగొట్టాయి. పుష్ప 2 కూడా బుల్లితెరపై రికార్డు రేటింగ్ దక్కించుకుంటుందని అందరూ అనుకున్నారు.
ఏదేమైనా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసిన ‘పుష్ప-2’ చిత్రానికి ఇలాంటి టీఆర్పీ రేటింగ్స్ రావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.