ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్న కాంబినేషన్ మళ్లీ రాబోతుంది. ప్రముఖ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసారు. ఈ విషయాన్ని పూరీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంటులో తెలిపారు.
ఇప్పుడే పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది అంటూ తెలిపారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ సినిమా ఎంత్ పాపులర్ అయిందో మనకు తెలిసిందే. ఆ చిత్రం తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా రాలేదు. ఇన్నే ఏళ్ల తర్వాత సినిమా అనగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.