పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది. చిత్రంలో చాలా భాగం హైదరాబాద్ మరియు బ్యాంకాక్ లలో చిత్రీకరణ జరుపుకుంది. గత నెలగా ఈ చిత్ర బృందం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. గతంలో మేము చెప్పిన విధంగా ఇలియానా బ్యాంకాక్ లో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పూరి జగన్నాథ్,రవి తేజ మరియు ప్రకాష్ రాజ్ రాబోయే వారం ఇండియా తిరిగి రానున్నారు. రఘు కుంచె ఈ చిత్ర పాటల రికార్డింగ్ కోసం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కావచ్చు.