బిజినెస్ మేన్ కోసం పూరీ వాయిస్ ఓవర్


పూరీ జగన్నాధ్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బిజినెస్ మేన్’ విడుదలకు దగ్గర పడింది. అయితే ఈ చిత్రానికి గాను పూరీ జగన్నాధ్ తన వాయిస్ ఓవర్ అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

చిత్ర ప్రారంభంలో కథను వివరిస్తూ మరియు కొన్ని కీలక సన్నివేశాల్లో తన గాత్రం అందించినట్లు సమాచారం. వాయిస్ ఓవర్ ఇవ్వడం పూరీకి కొత్తేమీ కాదు. గతంలో ‘యువత’, ‘సోలో’ చిత్రాలకి కూడా వాయిస్ ఓవర్ చెప్పారు. బిజినెస్ మేన్ ఈ నెల 13 న భారీగా విడుదల కాబోతుంది.

Exit mobile version