మాస్ మూవీస్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాకి భారీ పారితోషికం తీసుకోనున్నారు. ఈ హై వోల్టేజ్ ఎంటర్టైనర్ చిత్రం చిత్రీకరణ అక్టోబర్లో మొదలుకానుంది. ఈ చిత్రాన్ని నిర్మించనున్న బండ్ల గణేష్ బాబుకి పూరి జగన్నాథ్ చెప్పిన కథ విపరీతంగా నచ్చేయడంతో పూరికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. ఇంతకముందు పూరి మరియు బన్నీల కాంభినేషన్లో వచ్చిన ‘దేశముదురు’ మంచి విజయం సాదించింది. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ” కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్ర చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మరియు ఆయన దర్శకత్వం వహించిన ‘దేవుడు చేసిన మనుషులు’ ఈ నెలలో విడుదల కానుంది.