సుధీర్ బాబు, నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వి’. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు ఐపీఎస్ అధికారిగా కనిపించనుండగా నాని ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం సుధీర్ బాబు కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. ఇందులో ఆయన ఇంట్రడక్షన్ సీన్ కోసం ఏకంగా రూ.2 కోట్లు వెచ్చించారట.
హైదరాబాద్ పాతబస్తీని పోలిన సెట్ ఒకటి రూపొందించారట. ఇందులో జరిగే హెవీ యాక్షన్ సీన్ ద్వారా సుధీర్ బాబు ఇంట్రో ఉండనుంది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుందంటున్న సుధీర్ బాబు తనకు, నానికి మధ్యన జరిగే సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకుల్ని గొప్పగా ఆకట్టుకుంటాయని ధీమాగా చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 25న విడుదలకానుంది.