పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి హారర్ కామెడీ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఇక ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్ రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుందని ఈ చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ టైమింగ్ చాలా కాలం గుర్తుండిపోతుందని.. ఆయన టైమింగ్‌ను ప్రత్యక్షంగా సెట్స్‌లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని.. ఊరికే పాన్ ఇండియా స్టార్స్ అయిపోరు.. అంటూ ఆయన కామెంట్ చేశారు.
దీంతో ఈ సినిమాలో ప్రభాస్ టైమింగ్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.