పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం తమిళ హీరో విజయ్ బ్లాక్‌బస్టర్ ‘తేరి’ సినిమాకు రీమేక్ అనే వార్త గతంలో వినిపించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయంపై మౌనంగానే ఉన్నప్పటికీ, టీమ్ మాత్రం “రీమేక్ ఫీల్ ఉండదు” అని చెబుతోంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ కథలో తేరి కోర్ పాయింట్‌ను మాత్రమే ఉపయోగించి, మిగతా స్క్రిప్ట్‌ను తెలుగుతనం పవన్ కళ్యాణ్ స్టైల్‌కు సరిపోయేలా హరీష్ శంకర్ మార్చినట్లు సమాచారం. ఆయనకు రీమేక్‌లను కొత్తగా తీర్చిదిద్దే అనుభవం ఉండటంతో అభిమానులు కూడా సినిమా ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి స్పందిస్తూ.. స్క్రిప్ట్‌లో ఉన్న బలమైన కంటెంట్ కారణంగా ఈ చిత్రం భారీ సెన్సేషన్‌గా నిలుస్తుందని తెలిపారు. రీమేక్ అనిపించే అవకాశమే లేదని కూడా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు విడుదలకు ముందే సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి.


