‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

Mutton Soup

రామకృష్ణ వట్టికూటి సమర్పణలో, అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మటన్ సూప్’ చిత్రానికి టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేశారు. రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో, హీరోయిన్. ఈ చిత్రానికి ‘Witness the Real Crime’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. నిర్మాతలు మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న టైటిల్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, “పర్వతనేని రాంబాబు సారథ్యంలో వస్తున్న ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ బాగా ఉంది. టీంకు శుభాకాంక్షలు. సినిమా హిట్ కావాలి” అని అన్నారు.

నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ, “మా పోస్టర్‌ను విడుదల చేసిన కె.ఎస్. రామారావు గారికి ధన్యవాదాలు. త్వరలోనే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి” అని అన్నారు. హీరో రమణ్ మాట్లాడుతూ, “రామచంద్ర మంచి కథతో ‘మటన్ సూప్’ తీస్తున్నారు. టైటిల్, మోషన్ పోస్టర్లు అద్భుతంగా వచ్చాయి. సపోర్ట్ చేసిన కె.ఎస్. రామారావు గారికి ధన్యవాదాలు. మేమంతా బాగా కష్టపడుతున్నాం. సినిమాను తప్పకుండా ఆదరించండి” అని అన్నారు.

దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ, “పర్వతనేని రాంబాబు గారి సారథ్యంలో, రామకృష్ణ వట్టికూటి సమర్పణలో ‘మటన్ సూప్’ చేస్తున్నాం. మా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన కె.ఎస్. రామారావు గారికి కృతజ్ఞతలు” అన్నారు. నిర్మాత రామకృష్ణ సనపల మాట్లాడుతూ, “నిజ సంఘటనల ఆధారంగా ‘మటన్ సూప్’ రూపొందించాం. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అందరి సహకారానికి ధన్యవాదాలు” అని అన్నారు.

Exit mobile version