క్రిష్ కోసం రంగంలోకి దిగిన నిర్మాత ?

క్రిష్ కోసం రంగంలోకి దిగిన నిర్మాత ?

Published on Nov 11, 2020 1:07 AM IST

దర్శకుడు క్రిష్ ప్రజెంట్ వైష్ణవ తేజ్ సినిమాను ముగించే పనిలో ఉన్నారు. ఇంకొద్దిరోజుల్లో అన్ని పనులు పూర్తవుతాయి. అందుకే ఆయన పవన్ సినిమాను రీస్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారు. మొదట పవన్ ‘వకీల్ సాబ్’ పూర్తయ్యాక క్రిష్ సినిమానే చేయాలని అనుకున్నారు. కానీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చకచకా సెట్టైపోవడంతో ఆ సినిమా కోసం కాల్ షీట్స్ కేటాయించాల్సి వచ్చింది. దీంతో క్రిష్ సినిమా వాయిదాపడే పరిస్థితి నెలకొంది.

కానీ క్రిష్ మాత్రం డిసెంబర్లో ఎలాగైనా షూట్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. రీమేక్ సినిమా మధ్యలో పవన్ కొన్ని డేట్స్ కేటాయిస్తే కీలక సన్నివేశాలు తెరకెక్కించాలని అనుకుంటున్నారు. అందుకోసం పవన్ ను ఒప్పించాల్సి ఉంది. అందుకే క్రిష్ కు తోడుగా నిర్మాత ఏ.ఎమ్.రత్నం రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. ఛాన్నాళ్ల క్రితమే ఆయనకు ఒక సినిమా చేసి పెడతానని పవన్ మాటిచ్చారు. ఆ మాట మేరకే క్రిష్ సినిమాకు నిర్మాతగా ఆయన సెట్టయ్యారు.

ప్రస్తుతం ఏ.ఎమ్.రత్నం హైదరాబాద్లోనే ఉన్నారట. షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలపై దర్శకుడితో చర్చలు జరుపుతున్న ఆయన పవన్ ను కూడ కలిసి డిసెంబర్లో కొన్ని కాల్ షీట్స్ ఇవ్వాలని అడిగే అవకాశం లేకపోలేదు.

తాజా వార్తలు