ఓజి బ్యూటీ ఇచ్చిన అప్డేట్.. ఏమిటంటే?

ఓజి బ్యూటీ ఇచ్చిన అప్డేట్.. ఏమిటంటే?

Published on Feb 19, 2025 1:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘ఓజి’ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఇది అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ప్రియాంక మోహన్ తాజాగా ఓ అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్‌లో ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉందని.. పవన్ లాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కల అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఈ కామెంట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌లో ఓజి పై మరింత క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు