ఈ నెల 14న తన నటప్రతిభను చాటుకోనున్న ప్రియమణి


తెలుగు పరిశ్రమలో ప్రియమణి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నాక ఆమె గత గ్లామర్ పాత్రలవైపు అడుగులు వేసింది గత కొద్ది సంవత్సరాలుగా గ్లామర్ పాత్రలనే నమ్ముకున్న ప్రియమణి విజయం మాత్రం సాదించలేకపోయింది కాని ఇప్పుడు ఈ భామ “చారులత” అనే చిత్రంతో తనలోని నటన ప్రతిభను తిరిగి జనంలోకి చేర్చాలని అనుకుంటుంది. ఈ చిత్రంలో ప్రియమణి అవిభక్త కవలల పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి పొన్ను కుమరన్ దర్శకత్వం వహించారు. రమేష్ కృష్ణ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రం త్రిభాష చిత్రంగా తెలుగు,తమిళ్ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. సుందర్ బాబు ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎం వి పన్నీర్ సెల్వన్ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version