ప్రస్తుతం కెరీర్ బిజీగా సాగుతున్న ప్రియమణి కి మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అదేమిటంటే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘చెన్నై ఎక్స్ ప్రెస్’. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేయడానికి ఈ మూవీ డైరెక్టర్ రోహిత్ శెట్టి నయనతారని సంప్రదించారు. ఆమె చేయనని సున్నితంగా తిరష్కరించింది. దాంతో రోహిత్ శెట్టి ప్రస్తుతం ఈ పాట కోసం ప్రియమణిని సంప్రదించాడు.
ప్రియమణి ఒప్పుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరియు షారుఖ్ ఖాన్ – దీపికా పడుకొనే ఈ సినిమాలో నటిస్తున్నందువల్ల ప్రియమణి ఈ ఛాన్స్ ఉపయోగించుకుంటే నేషనల్ లెవల్లో గుర్తింపు వస్తుంది. గతంలో మణిరత్నం తీసిన ‘రావణ్’, రామ్ గోపాల్ వర్మ తీసిన ‘రక్త చరిత్ర 2’ సినిమాలు ఇండియా మొత్తం విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రియమణి ‘అంగుళీక’, ‘చండి’ సినిమాలో నటిస్తోంది.