సీనియర్ హీరోయిన్ ప్రియమణికి ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్, నారప్ప చిత్రం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రియమణి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రేక్షకులు దక్షిణాది చిత్రాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ప్రాంతీయ భాషలలో తీసిన సినిమాలను కూడా బాగా ఆదరిస్తున్నారు’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది.
ప్రియమణి ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి ఇంతక ముందు ఇలా ఉండేది కాదు. ప్రస్తుతం సాంకేతిక నిపుణులు, దర్శకుల గురించి కూడా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అలాగే, ఓటీటీల విషయానికి వస్తే.. విభిన్న పాత్రల్లో నటిస్తూ.. మన ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన వేదిక ఓటీటీ’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది. జాతీయ ఉత్తమ నటి అవార్డ్ పొందినా ప్రియమణికి గతంలో రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో, ఆమె హీరోయిన్ గా ఎక్కువ కాలం ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది.
