టాలెంటెడ్, బ్యూటీఫుల్ నటి ప్రియ ఆనంద్ నటించిన హిందీ సినిమా ‘ఫఖ్రేయ్’ మంచి విజయాన్ని సాదించింది. ఈ సినిమాలో ప్రియది చిన్న పాత్ర అయిన ముఖ్యమైన పాత్రలో నటించింది. నిన్న విడుదలైన ‘ఫఖ్రేయ్’ సినిమాను హిట్ సినిమాగా ప్రకటించారు. ప్రియ నటించిన మొదటి బాలీవుడ్ సినిమా ‘ఇంగ్లీష్ వింగ్లీష్’. దీనితో ఆమెకు దక్షిణన మంచి ఆదరణ లబించింది. ప్రస్తుతం ప్రియ తమిళంలో రెండు సినిమాలకు, తెలుగులో ఒక సినిమాకి సైన్ చేయడం జరిగింది. ఆమె చివరిగా తెలుగులో నటించిన సినిమా శర్వానంద్ ‘కో అంటే కోటి’.