పెటాతో కలిసి మరో కార్యక్రమం చేపడుతున్న ప్రియా ఆనంద్

పక్షులను బందించడానికి వ్యతిరేకంగా నటి ప్రియ ఆనంద్ చెన్నైలో పెటా ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపట్టారు.“పక్షులు స్వేచ్చగా ఎగరాలి వాటినుండి స్వేచ్చని మనం విడదీయకూడదు” అని ప్రియా ఆనంద్ అన్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన కనబడింది. గతంలో ఈ నటి వీధి కుక్కలను చంపడానికి వ్యతిరేకంగా పెటా ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఈ నటి తమిళంలో “ఎదిర్ నీచల్” అనే చిత్ర చిత్రీకరణలో పాల్గొంటుంది. త్వరలో ఈ భామ శర్వానంద్ సరసన నటిస్తున్న “కో అంటే కోటి” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటుంది.ఈ రెండు చిత్రాలు కాకుండా ఫర్హాన్ అక్తర్ రాబోతున్న చిత్రం “ఫక్రే”లో ఈ భామ ఒకానొక ప్రధాన పాత్ర పోషించనుంది. చూస్తుంటే 2012 ప్రియా ఆనంద్ కి గుర్తుండిపోయే సంవత్సరంగా కానుంది. “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రంలో ప్రియా ఆనంద్ నటన ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి.

Exit mobile version