నవంబర్ 7న ‘ప్రేమిస్తున్నా’ చిత్రం విడుదల ఖరారు

దర్శకుడు భాను రూపొందించిన సరికొత్త ప్రేమకథా చిత్రం “ప్రేమిస్తున్నా” నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా నటించిన ఈ చిత్రాన్ని కనకదుర్గారావు పప్పుల (వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్) నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ట్రైలర్ విడుదల సందర్భంగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి “ప్రేమిస్తున్నా” చిత్రానికి బెస్ట్ విషెస్ అందించారు. ట్రైలర్ బాగుందని ప్రశంసించిన ఆయన, సినిమా విజయం సాధించి హీరోహీరోయిన్లకు, దర్శకుడు భానుకు, నిర్మాత కనకదుర్గారావు గారికి మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.

దర్శకుడు భాను మాట్లాడుతూ, ఇది ‘అన్ కండీషనల్ లవ్’ తో తెరకెక్కిన సినిమా అని, తెలుగులో ఇంతవరకు అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథ రాలేదని తెలిపారు.
ట్రైలర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించిందని, ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకు రాబోతోందని పేర్కొన్నారు. భాస్కర్ శ్యామల సినిమాటోగ్రఫీ అందించగా, అనిల్ కుమార్ అచ్చు గట్ల సంభాషణలు రాశారు. శిరీష్ ప్రసాద్ ఎడిటర్, మర్రి రవికుమార్ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు.

Exit mobile version