గత సంవత్సరం తమిళంలో వచ్చి హిట్ అయిన ‘అదలాల్ కాదల్ సీవియర్’ సినిమాని డబ్ చేసి తెలుగులో ప్రేమించాలి సినిమా గా రిలీజ్ చేస్తున్నారు. గతంలో తెలుగు ప్రేక్షకులకు ‘ప్రేమిస్తే’, ‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’ సినిమాలను అందించిన సురేష్ కొండేటి ఈ సినిమాకి నిర్మాత. శివరాత్రి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 300 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా గురించి సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘ యువతని బాగా ఆకట్టుకునే ఈ సినిమాలో అందరినీ ఆలోజింపజేసే మెసేజ్ కూడా ఉంటుంది. తల్లి తండ్రులను ప్రేమించే పిల్లలు, పిల్లల్ని ప్రేమించే తలలు తండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇదని’ అన్నాడు. సంతోష్, మనీష్ యాదవ్ జంటగా నటించిన ఈ సినిమాకి సుశీంధ్రన్ డైరెక్టర్ కాగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.