ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘జింఖానా’

గత ఏడాది మళయాళ సినిమా సహా తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకున్న యువ హీరో నెస్లన్ ‘ప్రేమలు’ చిత్రంతో మంచి మార్క్ ని సొంతం చేసుకున్నాడు. మరి ఈ యంగ్ హీరో నుంచి వచ్చిన మరో కామెడీ డ్రామా చిత్రమే “జింఖానా”. గత ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. తెలుగులో కూడా ఓ మాదిరిగానే ఆడిన ఈ కామెడీ బాక్సింగ్ డ్రామాని ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించారు.

అయితే ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లివ్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో మళయాళం సహా తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఈ జూన్ 13 నుంచి సినిమా అందుబాటులో ఉండనున్నట్టుగా సోనీ లివ్ వారు కన్ఫర్మ్ చేశారు. సో ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు ఆరోజు వరకు వేచి చూడాలి.

Exit mobile version