ప్రేమ ఇష్క్ కాదల్ పాటలకు మంచి స్పందన

prema-ishq-kaadhal
‘తకిట తకిట’ సినిమా ద్వారా పరిచయమైన హర్షవర్ధన్ రానే తన నటనతో విమర్శకులను మెప్పించి ‘అవును’ విజయం సాధించడంతో మరింత ఆనందంలో వున్నాడు

ఈ యువ హీరో ఇప్పుడు తన తదుపరి సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ఆడియోకి మంచి స్పందన వస్తుంది. వివిధ సామాజిక నెట్వర్కింగ్ సైట్ ల ద్వారా ఈ సినిమా పాటలకు పలు ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రవణ్ అనే టాలెంటెడ్ కుర్రాడు ఈ సినిమాకు పాటలను స్వరపరిచాడు. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధమవుతుంది

హర్షవర్ధన్, విష్ణువర్ధన్, హరీష్, వితిక, రీతూ మరియు శ్రీ ముఖి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సద్దినేని దర్శకుడు. బెక్కమ్ రాజగోపాల్ నిర్మాత

Exit mobile version