షూటింగ్ ముగించుకున్న ప్రతిఘటన

షూటింగ్ ముగించుకున్న ప్రతిఘటన

Published on Nov 23, 2013 1:20 PM IST

Charmme
ఛార్మీ ప్రధాన పాత్రలో మునుపటి తరం దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కిస్తున్న సినిమా ‘ప్రతిఘటన’. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర పనులలో వుంది.

గతంలో విజయశాంతి ప్రధాన పాత్రలో ‘ప్రతిఘటన’ సినిమా విడుదలై 1986లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు అదే సినిమా పేరును మరోసారి వాడుకుంటున్నారు. అతుల్ కులకర్ణి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఛార్మీ నిజాయితీ గల జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుంది. తమ్మారెడ్డి భరద్వాజ స్వయంగా నిర్మించిన ఈ సినిమా త్వరలో మనముందుకు రానుంది

తాజా వార్తలు