వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న ప్రసాద్ బెహరా

Prasad-Behera

ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ టాలెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన కొత్త ఆర్టిస్టులను న్యూ ఏజ్ దర్శకులు ప్రోత్సహిస్తున్నారు.

ఈ తరహాలో యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లతో పేరు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు వెండితెరపై వేగంగా దూసుకుపోతున్నాడు. ‘కమిటీ కుర్రోళ్లు’లో ఎమోషన్‌తో, ‘మిత్ర మండలి’లో కామెడీతో ఆకట్టుకున్నాడు. ‘బ్యూటీ’, ‘బచ్చలమల్లి’, ‘విరాజి’ వంటి సినిమాల్లో కూడా తన నటనతో మెప్పించాడు.

‘మా విడాకులు’, ‘పెళ్లివారమండి’ వంటి యూట్యూబ్ హిట్స్‌తో ఫాలోయింగ్ సంపాదించిన ప్రసాద్, త్వరలో విడుదల కానున్న ‘పాపం ప్రతాప్’, ‘రోమియో జూలియట్’ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో వేగంగా ఎదుగుతున్న బిజీ ఆర్టిస్టుగా నిలిచాడు.

Exit mobile version