సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. సినిమాలో పవన్ పాత్ర చేసే పనులను పలు సందర్భాల్లో కథలుగా వింటూ ఓ యువతి పవన్ పాత్రలో ప్రేమలో పడుతుందని.. కాగా ఆ ప్రేమించే హీరోయిన్ గా ప్రణీత సుభాష్ నటించబోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.
కాగా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాలతో పాటు హరీష్ శంకర్ సినిమా కూడా పవన్ అంగీకరించారు.