సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రదీప్ రంగనాథన్

సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రదీప్ రంగనాథన్

Published on Nov 25, 2025 1:30 AM IST

Pradeep Ranganathan

తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ఓ సెన్సేషన్. జయం రవితో ‘కోమలి’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. అటుపై ‘లవ్ టుడే’తో నటుడిగా, దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. ఇక లవ్ టుడే సక్సెస్‌తో ప్రదీప్ రంగనాథన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాదిలో డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో వరుసగా వంద కోట్ల హిట్లు అందుకున్నాడు.

అయితే, ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు. స్టార్ బ్యూటీ నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం డిసెంబర్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే ఈ మూవీ ఈజీగా వంద కోట్ల క్లబ్‌కు వెళ్తుందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.

దీంతో ఈ ఏడాదిలో మూడు వంద కోట్ల సినిమాలు అందించిన హీరోగా ప్రదీప్ రంగనాథన్ రికార్డు క్రియేట్ చేస్తాడు. మరి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రానుందనేది వేచి చూడాలి.

తాజా వార్తలు