కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నేహా శెట్టి అలాగే మమిత బైజు హీరోయిన్స్ గా దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన ఎంటర్టైనర్ చిత్రం “డ్యూడ్”. ఈ దీపావళి కానుకగా తెలుగు సహా తమిళ్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని డే 1 అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఇదే హోల్డ్ తో డే 2 కూడా రాబట్టడం విశేషం రెండో రోజు కూడా ఈ చిత్రం 20 కోట్లకు పైగా రాబట్టి అదరగొట్టింది. ఇలా మొత్తం రెండు రోజుకి మొత్తం 45 కోట్లు అందుకొని దుమ్ము లేపింది. దీనితో ఈ సినిమా ఈజీగా 100కోట్ల వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.