ప్రొడక్షన్ అంటే భయం అంటున్న ప్రభుదేవా

Prabhu-Deva
చిన్న తనంలోనే కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి పరిచయమై ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా ఆ తర్వాత హీరోగా మారాడు. ప్రస్తుతం ప్రభుదేవా డైరెక్టర్ గా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇటీవలే ప్రభుదేవా మైనపు విగ్రహాన్ని లోనవల మైనపు మ్యూజియంలో ప్రతిష్టించారు. కెరీర్ పరంగా ఎంతో హ్యాపీగా ఉన్న ప్రభుదేవాకి ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలు తీయాలంటే మాత్రం చాలా భయం అంటున్నాడు.

కొరియోగ్రాఫర్ గా, హీరోగా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు, మరి నిర్మాతగా మారి ఎప్పుడు సినిమాలు చేస్తారు అని అడిగితే ‘ సినిమాలు నిర్మించాలంటే ఎంతో ధైర్యం కావాలి. నాకు అంత ధైర్యం లేదు. నాకు ఫిల్మ్ మేకింగ్ డిపార్ట్ మెంట్ లోకి అడుగుపెట్టాలంటే నాకు చాలా భయం. ప్రస్తుతం డైరెక్టర్ గా హ్యాపీ గా ఉన్నానని’ ప్రభుదేవా అన్నాడు. ప్రస్తుతానికి భయం అంటున్నా ముందు ముందు ఏమన్నా నిర్మాణ రంగంలోకి అడుగుపెడతాడేమో చూడాలి.

Exit mobile version