ఆకట్టుకుంటున్న ప్రభాస్ కొత్త లుక్

prabhas
గోపీచంద్ వివాహ వేడుకలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన లుక్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ భారీ హీరో ఎస్.ఎస్ రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ సినిమాకోసం తన వేషధారణ మార్చుకుని నిన్నటి వేడుకలో తలుక్కున మెరిసాడు. రాజసంగా కనిపించే మీసం, బాగా పెంచిన గెడ్డం ఈ కండలవీరుడు అందాన్ని మరింత పెంచేశాయి.
ఈ చారిత్రాత్మక సినిమాలో ప్రభాస్ సరసన రానా నటిస్తున్నాడు. అనుష్క హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూలై నుండి ప్రారంభంకానుంది. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
ప్రభాస్ లుక్ విషయానికి వస్తే అతని ఫాన్స్ కు, సినీ ప్రియులకు ఈ సినిమా వచ్చే సంవత్సరంలో విందు భోజనం అందించనున్నాడు.

Exit mobile version