వచ్చే నెలలో ‘రెబల్’ ఆడియో

వచ్చే నెలలో ‘రెబల్’ ఆడియో

Published on Jul 23, 2012 8:20 AM IST


మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ఇంత వరకు ఒక్కటి కూడా విడుదల కాలేదు. లారెన్స్ డైరెక్షన్లో చాలా రోజుల నుండి తెరకెక్కుతున్న ‘రెబల్’ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన యాక్షన్ సన్నివేశాలు పాండిచ్చేరిలో చిత్రీకరిస్తున్నారు. రెబల్ సినిమాకి మొదటగా తమన్ ని సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ అయన సినిమా నుండి తప్పుకోవడంతో ఆ భాధ్యతలు కూడా లారెన్స్ తీసుకున్నారు. రెబల్ ఆడియో వచ్చే నెలలో హైదరాబాదులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. రెబల్ సినిమాని జే. భగవాన్ మరియు జే. పుల్లారావు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు