ప్రభాస్ ‘బాహుబలి’ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్

bahubali-first-look

ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ మేకింగ్ వీడియోని ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేసారు. ఈ టీజర్ చివర్లో సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందా అనేది కొద్ది సెకన్లు చూపించారు. ఆ విజువల్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఫస్ట్ లుక్ స్క్రీన్ షాట్స్ సోషల్ నెట్వర్క్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.

రాచరిక వస్త్రాలలో ప్రభాస్ అసలు సిసలైన రాజులా ఉన్నాడు. ఈ మేకింగ్ వీడియోకి ఎంఎం కీరవాణి రోమాలు నిక్క బొడుచుకునే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ చిత్ర మూవీ మేకర్స్ ఈ సినిమా 2015లో రానుందని అధికారికంగా ఈ వీడియోలో అనౌన్స్ చేసారు.

‘బాహుబలి’ సినిమాని టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు. ఈ ఒక్క మేకింగ్ వీడియో ద్వారా సినిమా ఎలా ఉండబోతోంది అనేది మనం అంచనా వేయచ్చు. కావున 2015 త్వరగా వచ్చేయాలని కోరుకుందాం..

Exit mobile version