ప్లాన్ మార్చి క్లియర్ గా ఉన్న రెబల్ స్టార్.?

మన దేశంలోనే మోస్ట్ వాంటెడ్ అండ్ డిమాండ్ ఉన్న స్టార్ నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలితో వచ్చిన ఫేమ్ ను అలా స్టాండర్డ్ గా కొనసాగించడమే కాకుండా దానిని మరింత పెంచుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఒప్పుకున్నా మూడు భారీ చిత్రాలు ఉన్నాయి.

వాటిలో దర్శకుడు రాధ కృష్ణ తో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “రాధే శ్యామ్” ఆల్ మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇక దీని తర్వాత నాగశ్విన్ తో ఓ సినిమా అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో “ఆదిపురుష్” లు ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా అప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ తర్వాత ఈ రెండు సినిమాలను ఏకకాలంలోనే పూర్తి చేస్తారని టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు ప్రభాస్ మాత్రం తన ప్లాన్ ను మార్చినట్టు తెలుస్తుంది. మొదట ఆదిపురుష్ ను కంప్లీట్ చేసాకనే నాగశ్విన్ తో సినిమాను టేకప్ చెయ్యాలని ప్రభాస్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే తన ప్లాన్ పట్ల కూడా డార్లింగ్ క్లియర్ గానే ఉన్నాడని కూడా తెలుస్తుంది. అలాగే ఆదిపురుష్ ను కూడా సాధ్యమైనంత వరకు త్వరగానే ఫినిష్ చేసేయాలని ప్రభాస్ అంటుకుంటున్నాడని టాక్.

Exit mobile version