పోరాటాలు చేస్తున్న ప్రభాస్

పోరాటాలు చేస్తున్న ప్రభాస్

Published on Aug 18, 2012 3:15 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ వారధి’ చిత్రం చాలా రోజుల తర్వాత మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్రానికి ప్రముఖ కథా రచయిత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా శివకి ఇది తొలి చిత్రం. ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ప్రభాస్ పై వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. చాలా కాలం క్రితమే ఈ చిత్ర చిత్రీకరణ మొదలైనప్పటికీ, ప్రభాస్ ‘రెబల్’ సినిమా చిత్రీకరణ పూర్తి చెయ్యాలని ఈ చిత్రానికి కాస్త విరామం ఇచ్చారు. ఈ చిత్రంలో అనుష్క మరియు రిచా గంగోపద్యాయ కథానాయికలుగా నటిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించనున్న సినిమాలో నటించనున్నాడు.

తాజా వార్తలు