ఇటలీ వెళ్తున్న ప్రభాస్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వారధి’. ఈ చిత్రం కోసం ప్రభాస్ త్వరలోనే ఇటలీకి వెళ్లనున్నారు. ఇటలీలో ఈ చిత్రంలోని కొన్ని పాటలను చిత్రీకరించనున్నారు అందుకోసం ప్రభాస్ మరియు ఈ చిత్ర యూనిట్ ఇటలీకి పయనమవ్వనున్నారు. యోగా బ్యూటీ అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ కథా రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రం చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది, ఇటలీలో చిత్రీకరించబోయే పాటలతో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని 2012 చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణారెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version